సింగరేణి సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ఇతర రాష్ట్రాల్లో తవ్వకాలు చేపట్టింది , సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఏప్రిల్ 16 నుంచి ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి ఇది గర్వకారణం అన్నారు. సింగరేణి విస్తరణ, పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తుందన్నారు. మొత్తం సింగరేణి కుటుంబం విజయం సాధించాలని, రాబోయే అనేక మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
