గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఇంట్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.కాంగ్రెస్ హస్తం ఆపరేషన్‌లో కొందరు అసంతృప్త బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే అనుమానంతో బీజేపీ సీనియర్ లీడర్ బీఎస్ యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ డీసీఎం, అశోక సహా పలువురు నేతలతో యడియూరప్ప ఇంటిలో సమావేశం నిర్వహించి బీజేపీ ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించారు.
కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడే ఆలోచనలో లేరని, ఎమ్మెల్యేలు ఎవరూ బయటకు వెళ్లలేదని బీఎస్ యడియూరప్ప తన నివాసంలో రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో చెప్పారు. వివిధ కారణాలతో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోందని, అయితే బీజేపీని ఎవరూ వీడరని యడ్యూరప్ప విలేఖరులతో అన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బోమ్మయ్, డీవీ. సదానంద గౌడ, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.అశోక, బీజేపీ ఎమ్మెల్యేలుహాజరయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే 2019 రాజకీయ సంక్షోభం సమయంలో, పార్టీ ఫిరాయించిన వారితో సహా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ ఆకర్షించే అవకాశం ఉందన్నారు. శివకుమార్ ఇదే వారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బైరతీ బసవరాజ్, ఎస్ టీ. సోమశేఖర్, మునిరత్న,కే. గోపాలయ్య, శివరామ్ హెబ్బార్‌లు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు జంప్ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో వారి మీద బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీ ఫిరాయించి 2019లో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 17 మంది ఎమ్మెల్యేల్లో వీరు కూడా ఉన్నారు.
అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీకి ఎలా దూరమయ్యారో ఈ సమావేశంలో తేలింది.బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు అయిన యడ్యూరప్పను నమ్మి 17 మంది ఫిరాయింపుదారులలో, 16 మంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అప్పట్లో బీజేపీలో చేరారు. తరువాత యడియూరప్పను సీఎం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తరువాత మంత్రులు అయ్యారు.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్నయశ్వంత్‌పూర్ నియోజకవర్గానికి చెందిన సోమశేఖర్ తన స్థానిక బీజేపీ నేతలపై అసంతృప్తితో ఉన్నారని బహిరంగంగానే చెప్పారు.మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని దీనికి ముందు కలుసుకుని ఇదే విషయం గురించి మాట్లాడారు. అయితే యడ్యూరప్ప నివాసంలో జరిగిన సమావేశానికి బైరతి బసవరాజ్ తో పాటు కేఆర్ పురం ఎమ్మెల్యే ఎస్ టీ, సోమశేఖర్ కూడా హాజరు కాలేదు.ఇప్పుడు బీజేపీ నాయకుల్లో గుబులు మొదలైయ్యింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో చేరిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద సీనియర్ అధికారుల తీరుతో కొందరు విసిగిపోతున్నారని తెలిసింది.