”గుంటూరు కారం” నుంచి ఒక సాంగ్ రిలీజ్….

..”గుంటూరు కారం” నుంచి ఒక సాంగ్ రిలీజ్....
Cinema news

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా నే “గుంటూరు కారం” మరి ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ హైప్ నెలకొనగా ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ విషయంలో అయితే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది . ఈ దీపావళి ముందే రిలీజ్ కి రెడి ప్లాన్ చేసుకున్న ఫస్ట్ సింగిల్ నుంచి చిన్న బిట్ ఆడియో అయితే లీక్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది .

..”గుంటూరు కారం”  నుంచి ఒక సాంగ్ రిలీజ్....
Guntur Karam ” Mahesh Babu “

అయితే ఇది ఎలా లీక్ అయ్యింది అనేది పక్కన పెడితే వచ్చిన నిమిషాల్లోనే వైరల్ అయిపోవడం ఇది తెలిసిన మేకర్స్ వెంటనే దాన్ని సోషల్ మీడియాలో తొలగించడం అయితే జరిగిపోయింది. కానీ సాంగ్ మాత్రం లీక్ అవ్వడం ఇప్పుడు చిత్ర యూనిట్ కి పెద్ద షాకింగ్ గా మారింది అని చెప్పాలి. మరి ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.