రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డుని అందుకోనున్నాడు. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా మూవీ లలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభూషణ్ అవార్డు రావడంతో శుక్రవారం టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి అందరికి తెలిసిందే.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి చిరును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ చిరుకు రావడం పట్ల మెగాస్టార్ కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌లో చిరంజీవిని టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఘనంగా సన్మానం చేస్తారని సమాచారం.