అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం

అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం జరిగిన సంగతి మనకు తెలిసిందే. కాగా గతంలో రాష్ట్రంలో నెలకొన్నటు వంటి అనేక అంశాల పైన తీవ్రమైన విమర్శలతో పటు, ఇరుపక్షాల మధ్యన తీవ్రమైన వాదోపవాదనలు కూడా జరిగాయి… అయితే ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ నేతలు రాష్ట్రంలో ప్రజలందరికి కూడా కొన్ని బూటకపు వాగ్దానాలు చేశారని, ఆతరువాత అధికారాన్ని దక్కించుకున్న తరువాత ఆ వాగ్దానాలు తాము చేయలేమని వైసీపీ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

కాగా ఎన్నిలకు ముందు రాష్ట్ర ప్రజలందరికి కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామని, అన్ని రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు మాట మారుస్తున్నారు. తాను అలా అనలేదని, తమ మేనిఫెస్టో లో కూడా సన్న బియ్యం ప్రస్తావన ఎక్కడా రాలేదని, పేపర్ వారే తప్పుగా ప్రచారం చేశారని వెల్లడించారు. సభలో వైసీపీ నేతలు కూడా వివిధ అంశాలతో పాటు ఇంగ్లీషు మీడియం అంశం మీద కూడా మాట్లాడుతూ… చాలా వరకు తప్పుడు వాఖ్యలను ప్రస్తావించారు. కాగా వాటికి సంబంధిత వీడియోలను అన్నింటిని కూడా సేకరించి జనసేన పార్టీ వారు ఒక వీడియో ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.