త్రివిక్రమ్ సర్ప్రైజ్ తో మురిసిపోయిన యంగ్ హీరోయిన్…!

The young heroine was surprised by Trivikram's surprise...!
The young heroine was surprised by Trivikram's surprise...!

మన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన లేటెస్ట్ మూవీ నే “గుంటూరు కారం”. మరి ఈ మూవీ భారీ వసూళ్లతో రీజనల్ గా అదరగొట్టింది. అయితే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మరిన్ని మూవీ లతో బిజీ కానుండగా లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నట్టుగా కూడా కన్ఫర్మ్ అయ్యింది. మరి తాజాగా త్రివిక్రమ్ అయితే ఒక యంగ్ హీరోయిన్ మూవీ సెట్స్ లో సర్ప్రైజ్ విజిట్ చేశారట.

ఆమెనే యువ నటి సీరత్ కపూర్ కాగా ఆమె చేస్తున్న తాజా మూవీ నే “ఉషాపరిణయం”. ఈ మూవీ ని విజయ్ భాస్కర్ కే దర్శకత్వం వహిస్తుండగా శ్రీ కమల్ హీరోగా తన్విక హీరోయిన్ గా నటించగా ఈ మూవీ లో సీరత్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మరి ఈ మూవీ ను సెట్స్ లోకి త్రివిక్రమ్ రావడంతో ఈ యంగ్ హీరోయిన్ ఎగ్జైట్ అవుతూ ఆ స్పెషల్ మూమెంట్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

The young heroine was surprised by Trivikram's surprise...!
The young heroine was surprised by Trivikram’s surprise…!

ఆయన నా మూవీ సెట్స్ లోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని అంతే కాకుండా త్రివిక్రమ్ గారు మానిటర్ లో నాపై సీన్స్ ని గమనించడం ఈ స్పెషల్ మూమెంట్స్ అంతా గాడ్ ప్లాన్ అని అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ పోస్ట్ చేసి ఈ అవకాశం ఇచ్చిన దర్శకునికి థాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ ఈ ఆగస్ట్ 2న రిలీజ్ రాబోతుండగా ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే విజయ్ భాస్కర్ నే నిర్మాతగా కూడా చేస్తున్నారు.