యంగ్ హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ సుశీంద్రన్ కాంబినేషన్లో.. యాక్షన్, డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో రూరల్ ఎంటర్టైనర్గా ఒక స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ రూపొందుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘శివుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ పోస్టర్లో ఆది పినిశెట్టి తీక్షణమైన చూపులతో.. తలకు, ముక్కుకు గాయాలతో కనిపిస్తున్నారు. టైటిల్ లోగోపై కూడా రక్తం మరక కనిపిస్తోంది.
‘శివుడు’ టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తుండగా.. మరో బలమైన కంటెంట్‌తో ఆది పినిశెట్టి మళ్లీ మన ముందుకు వస్తున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆది పినిశెట్టి అన్నయ్య సత్యప్రభాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవిరాజా పినిశెట్టి సమర్పిస్తున్నారు. నిక్కీ గల్రానీ, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు కాగా.. సునీల్, హరీష్ ఉత్తమన్, కంచరపాలెం రాజు, జేపీ, శత్రు కీలక పాత్రధారులు.
వేల్రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి జై మ్యూజిక్ అందిస్తున్నారు. కాశీ విశ్వనాథన్ ఎడిటర్ కాగా, చంద్రబోస్ పాటలు రాశారు. ప్రస్తుతం శివుడు చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.