ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు..!

Aam Aadmi Party leaders' houses searched by central investigation agencies..!
Aam Aadmi Party leaders' houses searched by central investigation agencies..!

విమర్శలు ఎన్ని వచ్చినా.. విమపక్షాలు మండిపడుతున్నా.. ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నెల 4వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ జైలుకు వెళ్లిన తర్వాత..ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అమానతుల్లా ఖాన్‌కు చెందిన కార్యాలయం ,ఇల్లు సహా పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

వక్ఫ్ బోర్డు భూమికి సంబంధించిన వ్యవహారం. హవాలా లావాదేవీలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో సోదాలు నిర్వ హిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు.. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆప్‌ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. కాగా, ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఎమ్మె ల్యేగా ప్రతినిథ్యం వహిస్తోన్న అమానతుల్లా ఖాన్‌.. గతంలో ఢిల్లీవక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా పనిచేశారు. అయితే, ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ఆరోపణలు వచ్చాయి.