ఇరా ఖాన్.. స్టార్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు. ఆమె నాలుగేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అక్టోబర్ 10, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశం పంపారు. “నాలుగేళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నాను. వైద్యుల దగ్గర చికిత్స తీసుకున్నాను, ప్రస్తుతం బాగానే ఉన్నాను.
ఓ ఏడాదిగా మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పుకొచ్చారు. అందుకే మిమ్మల్ని నా జర్నీలో భాగం చేస్తున్నాను. అసలు నేనెందుకు ఒత్తిడికి లోనయ్యాను? ఏంటి అనే విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో” అని ఆశిస్తూ వీడియో ముగించారు. ఇరా ఖాన్ తన డిప్రెషన్ గురించి మున్ముందు మరిన్ని వీడియోలు చేయనున్నట్లు కనిపిస్తోంది.