తెరంగ్రేటానికి స్టార్ హీరో కూతురు రెడీ 

aamir-khans-daughter reveals-her-interest-lies-filmmaking

బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ గా చెప్పబడే అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ దర్శకురాలిగా ఆరంగ్రేటానికి సిద్దమయ్యారు. అయితే అది సినిమాకి అనుకుంటే పొరపాటే ఆమె ఒక నాటకాన్ని ప్రదర్సించానున్నారు.

ఈ నాటకం గ్రీకు కథాంశం నుండి ప్రేరణ పొందింది. ఈ నాటకం ఎంపిక చేసుకున్న నగరాల్లో ఈ సంవత్సరం చివరి నాటికి ప్రదర్శించబడుతుందని చెబుతున్నారు. ఇరా ఖాన్ ఈ నాటకం మీద ఇప్పటికే పని చేస్తున్నారని ఈ నాటకం నవంబర్ నాటికి సిద్ధంగా ఉంటుందని చెబ్తున్నారు.

థియేటర్ ఆర్ట్ అంటేనే ఒక మ్యాజిక్ అని, ఈ నాటకాలను దర్శకత్వం వహించడం తనకు చాలా ఇష్టమని ఆమె అంటోంది. తాను నటనపై ఆసక్తి చూపడం లేదని, ప్రపంచానికి తెలీని ఎన్నో భిన్నమైన కథలు చెప్పడం తనకు ఇష్టమని ఇరా అన్నారు. త్వరలో అన్ని రకాల కథలను తన దర్శకత్వంతో ప్రజల ముందు తస్తానని ఆమె చెబుతోంది.