విజయసాయి వ్యాఖల మీద బీజీపీ సీరియస్ ?

BGP Serious on Vijayasai comments.

ఏపీ సర్కార్ ఏమి చేసినా దానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసీసులు ఉన్నాయని వైసేపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.

పీపీఏలపై సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంపై వీరిద్దరూ ప్రధాని కార్యాలయం అధికారులకు వివరణ ఇచ్చినట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయసాయి వ్యాఖ్యల నేపధ్యంలో అప్రమత్తమైన ఏపీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని అందుకే వారిని ఢిల్లీ పిలిపించారని చెబుతున్నారు.