ఏబీసీడీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ మెగా కాంపౌండ్ హీరో అనే ట్యాగ్‌తో వెండితెరకు పరిచయమయి గౌరవం అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. అయితే తొలి సినిమా ఆడకపోయినా ఆ తరవాత వచ్చిన కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత 2017లో ఒక్క క్షణం సినిమాను చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నరకు పైగా విరామం తీసుకుని ఏబీసీడీ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో మనోడు ఏమేరకు ఆకట్టుకున్నదో రివ్యూలో చూద్దాం.

కధ :
ఇండియా వదిలి అమెరికాలో స్థిరపడ్డ విద్యా ప్రసాద్ (నాగబాబు) ఒక్కగానొక్క కుమారుడు అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్). అయితే కొడుకు విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు అని ప్లాన్ చేసి కొడుకుని, తన మేనల్లుడిని ఇద్దరినీ హైదరాబాద్ పంపేస్తాడు విద్యా ప్రసాద్. నెలకు ఐదు వేలే పంపుతానని వాతోతోనే బతకాలని కండిషన్ పెడతాడు. అయితే అనుకోని పతిస్తితుల్లో పాస్ పోర్ట్ లు కూడా పోగొట్టుకోవడంతో వాళ్ళు తప్పక తండ్రి మాట వినాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు అరవింద్. ఈ నేపధ్యంలో మరో రెండేళ్ళు అక్కడే ఉండాలని ఉండి ఎంబీఏ పూర్తి చేస్తేనే అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానని చెబుతాడు విద్యా ప్రసాద్. ఈ క్రమంలో భార్గవ్ అనే రాజకీయ నాయకుడితో గొడవ పెట్టుకుంటాడు అరవింద్. ఈ నేపధ్యంలో అరవింద్ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడా ? అతను ప్రేమించిన అమ్మాయి తిరిగి ప్రేమిస్తుందా ? భార్గవ్ తో గొడవ ఏమవుతుంది అనేదే మిగతా కధ.

విశ్లేషణ :
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. సంజీవ్ రెడ్డి అనే ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుదా శాండీ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఆద్యంతం కామెడీగా సాగింది. ఇది దర్శకుడికి మొదటి సినిమా అయినా ఎక్కడా అలా అనిపించకుండా తెరకెక్కించాడు దర్శకుడు. కథ, కథనాలు రొటీన్ గా ఉన్న మిగతా సరదాగా నడిపించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ కథ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. అయితే కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏబీసీడి ఆ విషయంలో మెప్పించిందనే చెప్పాలి. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. మళయాళంలో ఆల్రెడీ హిట్టైన ఈ సినిమాను తెలుగులో పర్ఫెక్ట్ రీమేక్ గా చేశారు. మక్కీకి మక్కీ దించకుండా మనకి కావాల్సిన మార్పులు చేసి తెరకెక్కించారు.
నటీనటులు :
సినిమాలో అల్లు శిరీష్ చాలా ఈజ్ తో నటించాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఆయనలోని నటుడు ఇంప్రూవ్ అయ్యాడు. ఆయన ఫ్రెండ్ పాత్ర చేసిన్ భరత్ కూడా తన కామెడీతో మెప్పించాడు. రుస్కర్ కూడా తన గ్లామర్ తో మెప్పించింది. వెన్నెల కిశోర్ ఛానల్ యాంకర్ గా కామెడీ పంచాడు. నాగబాబు ఎప్పటిలానే జీవించాడు. మిగతా వారంతా తమ తమ పరిధుల మేరకు నటించారు. ఇక చాన్నాళ్ళ నుండి డైరెక్షన్ డిపార్టమెంట్ లో ఉన్నవారిని చిన్న చిన్న పాత్రలలలో కనిపించేలా చేశాడు దర్శకుడు.
ఫైనల్ గా : అల్లువారబ్బాయికి మళ్ళీ నిరాశే

రేటింగ్ : 2.5 / 5