బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నది . పైగా ఈ రూమర్స్ కు బలం చేకూర్చేలా అనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడివిడిగా ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా విడాకులు నిజమే అని అభిషేక్ చెబుతున్నట్లు ఒక డీప్ ఫేక్ వీడియో కూడా వైరల్ అయ్యింది. మొత్తానికి తమపై వస్తున్న విడాకాల రూమర్స్ గురించి అభిషేక్ బచ్చన్ క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇంతకీ, అభిషేక్ బచ్చన్ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయం నిజమే అన్నట్టు బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లు కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి, ఇలాంటివి తీసుకుంటాం. కానీ, క్షమించండి’ అని అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు. అంటే ఐశ్వర్య రాయ్ ఇంకా తనతోనే ఉందని అభిషేక్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు.