బిగ్‌బాస్ నాల్గో సీజన్ మొత్తం మోనాల్ చుట్టే నడుస్తోంది. కాదు.. మోనాల్ చుట్టూ నడిచేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఏంమేం జరిగాయోనని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే.. మెనాల్, అభి, అఖిల్‌ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, మోనాల్ అఖిల్‌ల రొమాన్స్.. గొడవలు, ఏడుపులు.. రోమాంటిక్ ముచ్చట్లు ఇవే కనిపిస్తాయి. మోనాల్‌తో విడిపోదామనుకున్న ప్రతి సారి అభి, అఖిల్‌లను మోనాల్‌తో కలిసేలా చేయడమే బిగ్‌బాస్ పనిగా పెట్టుకున్నాడు.ఇక నేటి ఎపిసోడ్లో కూడా తన దత్త పుత్రిక మోనాల్‌ని హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మోనాల్‌ని అభిజిత్, అఖిల్ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్.
మోనాత్తో డేట్ అనగానే అభిజిత్ తెగ ఫీల్ అవుతున్నాడు. మోనాల్ విషయంలో నేను ఇన్వాల్వ్ కావొద్దనుకుంటున్నా. ఆమె పాయింట్ వచ్చిన ప్రతిసారి ఏదోఒక రాడ్ పడుతోంది. నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్ టాపికే బిస్కెట్ అవుతుంది’ అంటూ అభి ఎమోషనల్ కాగా, హరిక, సోహైల్ వెళ్లి ఓదార్చారు. మరోవైపు అఖిల్ మాత్రం.. ‘ఇక్కడ ఫిటింగ్ ఏం లేదు.. చేయాలనిపిస్తే చేయి లేదంటే లేదు’ అంటున్నాడు. ఇక బిగ్‌బాస్ దత్తపుత్రిక మాత్రం డేట్ అనగానే చిరునవ్వులు చిందిస్తూ.. అందంగా ముస్తాబవుతోంది. మరి అభి అంతాలా ఎమోషనల్ కావడానికి కారణమేంటి? మోనాల్ ఎవరితో డేట్‌కి వెళ్లింది అని తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.