తమిళనాడులో ఘోర ప్రమాదం

తమిళనాడులో ఘోర ప్రమాదం

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించటంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన విరుద్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ఈ మధ్యాహ్నం విరుద్‌నగర్‌ జిల్లా అచన్‌కులమ్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది.

దీంతో అక్కడ ఉన్న నాలుగు షెడ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 11మంది మృత్యువాతపడగా.. ఇరవైకి పైగా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.