జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. గత ఏడాది ఓ కారు కల్వర్టులో పడిపోయి ఐదుగురు మృతి చెందిన చోటుకు సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమల కిరణ్(35), మద్ది జాస్మిని(8) అనే ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన యలమల కిరణ్ (35), ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామానికి చెందిన మద్ది విష్ణుప్రియ, ఆమె కుమార్తె జాస్మిని పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు స్కూటీపై వెళ్తున్నారు. కొత్తపల్లి జాతీయ రహదారి మీదుగా వీరు వెళ్తుండగా.. సింహాచలం నుంచి ఒడిశాలోని అస్కా రోడ్డు వైపు వెళ్తున్న ఓడీ02బిఎన్ 8282 అనే నంబరు గల కారు ఈ స్కూటీని బలంగా ఢీకొంది.
దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. వీరిలో కిరణ్‌కు తలపై బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. విష్ణుప్రియ, జాస్మినికి తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చిన్నారి జాస్మిని మృతి చెందింది. విష్ణుప్రియ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. మందస ఎస్‌ఐ కోట వెంకటేష్ సంఘటనా స్థలానికి వెళ్లి, కేసు నమోదు చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది ఇదే స్థలంలో ఒడిశాకు చెందిన కారు కల్వర్టులో పడిపో యి ఐదుగురు ఒడిశా వాసులు మరణించారు. తర చూ ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఈ ప్రాంతా న్ని డేంజర్ జోన్‌గా గుర్తించి, హెచ్చరికలను ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు.