తనను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిందో యువతి. ఈ సంఘటన జిల్లాలోని నంద్యాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తనను మోసం చేసింది కాక తిరిగి తనతో ప్రేమగా ఉండాలని వేధించడంతో యాసిడ్ దాడికి పాల్పడినట్టు సుప్రియ వెల్లడించింది. తనతో పెళ్లికి కులం పేరుతో అడ్డు చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకొని మళ్లీ ఇప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తుంటే తట్టుకోలేక ఇలా చేశానని ఆమె తెలిపారు.