స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రస్తుతం ఈ మూవీ ని బ్యాలెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ పాత్రలతోనే స్టార్ట్ అవుతుందని టాక్ వస్తుంది . ఏది ఏమైనా ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ అంటే.. బాక్సాఫీస్ షేక్ అయినట్టే. ఇక ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.
అన్నట్టు ఈ మూవీ లో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది. దేవర పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్ ని ట్రై చేసాడు. మొత్తానికి ఈ మూవీ కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేశాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ సాంగ్ కూడా అందరిని అదరగొట్టింది.