చరణ్‌ కంటే ముందు నాని..!

actor-nani-got-an-aparchuniti-to-act-in-mani-ratnam-director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సౌత్‌ ఇండియా స్టార్‌ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని యువ హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఎన్నో అద్బుత కళాకండాలను తెరకెక్కించి బాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న మణిరత్నం దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటించాలని గత రెండు మూడు సంవత్సరాల కాలంగా భావిస్తున్నాడు. అయితే ఇద్దరు కూడా ఇతరత్ర బిజీ షెడ్యూల్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. వచ్చే సంవత్సరంలో వీరి కాంబో మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

రామ్‌ చరణ్‌ కంటే ముందు యువ హీరో నానికి మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో త్రిభాష చిత్రం ఒకటి తెరకెక్కుతుంది. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు నానిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తెలుగు వర్షన్‌ కోసం ఒక పాత్రలో నాని నటిస్తాడని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని నాని ప్రకటించాడు. చాలా కాలంగా కంటున్న కల నెరవేరబోతుందని, మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ప్రకటించాడు. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు కీలక పాత్రలో నటిస్తున్న సినిమాలో నానికి నటించే అవకాశం దక్కింది. సినిమా గురించి, అందులోని నాని పాత్ర గురించి పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు:

రాజ‌మౌళికి ఏఎన్నార్ అవార్డ్

సిసిలియా…సిసిలియా.. స్పైడ‌ర్ లో మ‌రో సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

ఎన్టీఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌