రాజ‌మౌళికి ఏఎన్నార్ అవార్డ్

Nagarjuna announces ANR award for Rajamouli in Twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబలితో అంత‌ర్జాతీయంగా పేరు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ద‌ర్శ‌క ధీరుడికి ఏఎన్నార్ జాతీయ అవార్డు ద‌క్కింది. ఈ విష‌యాన్ని అక్కినేని నాగార్జున ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. సినీ రంగానికి చేసిన అద్భుత‌మైన సేవ‌ల‌కు గానూ జ‌క్క‌న్న‌కు ఈ అవార్డు ప్ర‌దానం చేయ‌నున్నామ‌ని నాగార్జున తెలిపారు. రాజ‌మౌళికి ఏఎన్నార్ అవార్డు ఇవ్వ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నామ‌ని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ నెల 17వ‌తేదీన ఈ అవార్డు ప్ర‌దానం చేయ‌నున్నారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు రాజ‌మౌళికి అవార్డు అంద‌జేస్తార‌ని నాగార్జున చెప్పారు.

సినీ నేప‌థ్య‌మున్న కుటుంబానికి చెందిన రాజ‌మౌళి రాఘ‌వేంద్ర‌రావు శిష్యుడిగా సినీరంగంలో ప్ర‌వేశించారు. తొలి సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ మొద‌లుకుని బాహుబ‌లి 2 దాకా ఆయ‌న తీసిన‌వ‌న్నీ హిట్ చిత్రాలే. బాహుబ‌లి 1,2 సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లారు రాజ‌మౌళి. త‌న సినిమాలతో ఎన్టీఆర్‌, నితిన్‌, రామ్‌చ‌ర‌ణ్ తేజ‌, ప్ర‌భాస్ వంటి హీరోల‌ను స్టార్ లుగా మ‌లిచారు. రాజ‌మౌళితో తెలుగు సినిమా డైరెక్ట‌ర్ల రేంజ్ కూడా మారిపోయింది.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

మేడ మీద అబ్బాయి… తెలుగు బులెట్ రివ్యూ