సిసిలియా…సిసిలియా.. స్పైడ‌ర్ లో మ‌రో సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Ceciliya Ceciliya song teaser released by rakul preet singh in twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ సినిమా పాటలు ఆడియో విడుద‌ల వేడుక‌కు ముందే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చిత్ర యూనిట్ ముందుగా రిలీజ్‌చేసిన రెండు పాట‌లు యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. సాయంత్రం చెన్నైలో ఆడియో విడ‌ద‌ల జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో సినిమాలోని మ‌రో సాంగ్ టీజ‌ర్ ను హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. స్పైడ‌ర్ లో ఇది త‌న‌కు ఇష్ట‌మైన పాట అని ర‌కుల్ తెలిపారు. సిసిలియా…సిసిలియా అని సాగే ఈ పాట అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది.

హ‌రీశ్ జైరాజ్ స్పైడ‌ర్ కు మ్యూజిక్ అందించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిన స్పైడ‌ర్ ఆడియో వేడుకను చెన్నైలో నిర్వ‌హిస్తున్నారు. మ‌హేశ్ న‌టించిన పూర్తి స్థాయి త‌మిళ చిత్రం ఇదే కావ‌టంతో కోలీవుడ్ ఈ సినిమాను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. తొలి సినిమా అయినా మ‌హేశ్ బాబు త‌మిళంలో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.

తెలుగులో స్టార్ హీరో అయిన మ‌హేశ్ బాబు స్పైడ‌ర్ తో త‌మిళంలోనూ పెద్ద హీరో గా గుర్తింపు పొందుతార‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉంది. మురుగ‌దాస్ డైరెక్ట‌ర్ కావ‌టంతో పాటు పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించ‌టంతో స్పైడ‌ర్ పై కోలీవుడ్‌లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ద‌స‌రా కానుక‌గా స్పైడ‌ర్ సెప్టెంబ‌రు 27న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. త‌మిళంలోనూ అదే రోజు రిలీజ్ కానుంది.

మరిన్ని వార్తలు:

రాజ‌మౌళికి ఏఎన్నార్ అవార్డ్

ఎన్టీఆర్‌ శతమానంభవతి వర్కౌట్‌ అయ్యేనా?

ఎన్టీఆర్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌