నిఖిల్‌, విజయ్‌ల సోషల్‌ ఫైట్‌…!

Actor Nikhil Siddharth Counter To Vijay Deverakonda

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండకు ‘నోటా’ చిత్రం కాస్త నిరాశ పరిచింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో విజయ్‌తో పాటు, ఈయన అభిమానులు కూడా కాస్త నిరాశపడ్డారు. ఈ చిత్రం అటు తమిళ ప్రేక్షకులను, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టులేక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలింది. సినిమా టాక్‌ ఇలా ఉంటే ఏ స్టార్‌ హీరో కూడా తన చిత్రం పరాజయం అయ్యింది అని వారం రోజుల్లో స్టేట్‌మెంట్‌ ఇవ్వడు. కానీ విజయ్‌ మాత్రం ‘నోటా’ విడుదలయిన వారం రోజుల్లోనే ఇది పరాజయం పాలయ్యిందని, ఎవరైనా పండుగ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి, తర్వాత మీకు ఆ ఛాన్స్‌ రాదు, ఒక్క పరాజయానికే యాటిట్యూడ్‌ మార్చుకోవాల్సిన అవసరం లేదు, త్వరలోనే మంచి సక్సెస్‌తో మీ ముందుకు వస్తాను అని బహిరంగ లేఖను రాశాడు.

vijay-devarakonda

యంగ్‌ హీరో నిఖిల్‌ ట్వీట్‌ తాజగా మాట్‌ టాఫిక్‌గా మారింది. నిఖిల్‌ ఎవరైతే ప్రపంచం అంతా తన చుట్టూ ఉంది అని ఫీల్‌ అవుతారో, యాటిట్యూడ్‌ అనే ముసుగు చుట్టూ విసురుతూ ఉంటారో… మిత్రమా మీరు అంత ముఖ్యమేమి కాదు, సినిమా నిర్మాణం అనే సముద్రంలో మనమంతా చిన్న నీటి బొట్టులం, ప్రతి నటుడు తనకు తానే పోటీగా నటించాలి, ఇకపోతే హైప్‌ను తగ్గించి పని ఎక్కువ చేయాలి అంటూ నిగూఢార్థ ట్వీట్‌ చేశాడు. దాంతో నిఖిల్‌ ట్వీట్‌ విజయ్‌కు కౌంటర్‌ అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది. నిఖిల్‌ ఎవరిని ఉద్దేశించి ఇలా పోస్ట్‌ చేశాడో కానీ అది కరెక్ట్‌ టైమింగ్‌కు రావడం వల్ల విజయ్‌కు కౌంటర్‌ అంటూ ఇరు అభిమాన వర్గాల మధ్య సోషల్‌ ఫైట్‌ జరుగుతోంది.

nikil