Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన సాయి కుమార్‌కు తాజాగా ఘోర పరాభవం ఎదురైంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఈయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నాడు. తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని భావించాడు. తెలుగు రాష్ట్రానికి సరిహద్దున ఉన్న బాగేపల్లి నియోజక వర్గం నుండి సాయి కుమార్ పోటీ చేశాడు. తెలుగు వారు ఎక్కువ ఉండటంతో పాటు, ఆ ప్రాంతంలో తనకున్న అభిమానులతో ఈజీగా గెలిచేస్తాను అని భావించాడు. కాని షాకింగ్‌గా ఫలితం తారు మారు అయ్యింది.
బాగేపల్లిలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరోసారి గెలుపొందాడు. బీజేపీ తరపున పోటీ చేసిన సాయి కుమార్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రదర్శణ చేసిన బీజేపీ ఈ నియోజక వర్గంలో మాత్రం కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేక విఫలం అయ్యింది. సాయి కుమార్‌ను కాకుండా మరెవ్వరినైనా పెట్టి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ఇప్పుడు అక్కడ బీజేపీ నాయకుల్లో చర్చ జరుగుతుంది. డైలాగ్ కింగ్ అయిన సాయికుమార్ ఎన్నికల సమయంలో గట్టిగానే మాట్లాడి, ఓటర్ల దృష్టిని ఆకర్షించాడు. సాయి కుమార్ గెలిచి ఉంటే, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఖచ్చితంగా మంచి పదవి దక్కేది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాల్లో పెద్ద డైలాగ్స్‌ను అనర్ఘలంగా చెప్పే సాయికుమార్ ప్రస్తుతం గొంతు మూగ పోయి మౌనంగా కూర్చుండిపోయాడు.