ప్రముఖ నటుడు, బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యరాజ్ తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడంతో సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు.
తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తున్నా నాన్న క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశాడు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని… ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు పేర్కొన్నాడు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా సత్య రాజ్ తనయుడైన శిబి సత్యరాజ్ మాయోన్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.