పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో సిద్దార్థ్. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ మండిపడ్డాడు. నిర్మాతలు కొన్నాళ్లుగా వసూళ్ల విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడ్, మీడియా కూడా ఈ అబద్ధపు లెక్కలనే అధికారికంగా ప్రకటిస్తోంది. అన్ని చలనచిత్ర పరిశ్రమల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఇంతకీ ఇలా అబద్ధపు రిపోర్టులు ఇవ్వడానికి ఎంత కమీషన్ తీసుకుంటున్నారేంటి? అని ట్విటర్లో మండిపడ్డాడు. పాన్ ఇండియా సినిమాలకు నిజాయితీ లేకుండా పోయిందంటూ దుమ్మెత్తిపోశాడు.
ఎంత ఇష్టమైన సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూసేంత ఓపిక తనకు లేదన్న సిద్దార్థ్ దర్శకులు కొత్త కథల్ని తెరకెక్కించాలని కోరారు. ఇంతకీ ఈయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్దార్థ్ తెలుగులో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, ఆట, బొమ్మరిల్లు, ఓ మై ఫ్రెండ్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. చాలాకాలం విరామం తర్వాత మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.