బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కూడానా చేశారు. దర్శనానంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. కాగా, ఆమె ఇంతకుముందు కూడా పలుమార్లు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఇక జాన్వీ కపూర్ తెలుగులో ‘దేవర’ మూవీ తో అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించే అకాశం దక్కించుకున్నారు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌కి మంచి జోడిగా ఆమె నటించనున్నారు.