తెలుగు నటి ప్రగతి ఒక స్టార్ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఆ నిర్మాతే ప్రగతిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ నిర్మాత పేరు మాత్రం బయటకు రాలేదు. కానీ మరోవైపు నటి ప్రగతి మాత్రం ఈ విషయం పై క్లారిటీ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రగతి, తన పై వచ్చిన రూమర్స్ ను చూసి, వెంటనే తన సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా క్లారిటీ ఇస్తూ.. తనకు నిస్సందేహంగా ఇక ఎవరినీ వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పేసింది .
నిరాధారమైన కథనాలను వ్యాప్తి చేయవద్దని మీడియాను కోరింది. మీడియా చేస్తున్న ఇలాంటి నిరాధారమైన ఆరోపణలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం, ప్రగతి డబుల్ ఇస్మార్ట్ చిత్రీకరణలో బిజీగా ఉంది. అలాగే ఆమె నటిస్తున్న అనేక ఇతర మూవీ ప్రాజెక్ట్లు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, ప్రగతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, భర్తతో విడిపోయిన సంగతి మనకి తెలిసిందే. అలాగే ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.