సాయేషాని పెళ్లాడనున్న బ్రదర్…!

Actress Sayyeshaa Saigal To Reportedly Marry Tamil Actor Arya

వరుడు, సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో ఆర్య‌(38) అఖిల్ అనే చిత్రంతో టాలీవుడ్ అభిమానుల‌ని ప‌ల‌క‌రించిన‌ స‌యేషా సైగ‌ల్‌(21)ని వివాహం చేసుకోనున్నాడ‌ట‌. మొన్న‌టి వ‌ర‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్ద‌రు పెళ్లి బంధంతో ఒక్క‌టి కానున్నార‌ని చెబుతున్నారు. మార్చి 9, 10 తేదీల‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం. 2018 ఆగస్ట్ లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పన్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

స‌యేషా హిందీలో శివాయ్ అనే చిత్రం చేయ‌గా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌న‌మ‌గ‌న్ చిత్రంతో ప‌రిచ‌యం అయింది. స‌యేషా ప్ర‌ముఖ దిలీప్ కుమార్, సైరా భానుల మ‌న‌వ‌రాలు అనే సంగ‌తి తెలిసిందే. ఆర్య గ‌తంలో త‌న ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్స్ కానీ కండీషన్స్ కానీ లేవు. నేను మీకు నచ్చితే ఆ అమ్మాయికి చక్కటి జోడీ అవుతానని అనిపిస్తే నా నంబర్ 73301-73301కి కాల్ చేయండి. ఇది ఫేక్ కాదు. నా లైఫ్ అని వీడియో ద్వారా తెలిపారు. వెంట‌నే అభిమానులంద‌రు ఆ నంబ‌ర్‌కి కాల్స్ చేయ‌డం మొదలు పెట్టారు. అయితే ఆర్య తాను అమ్మాయి కావాల‌ని అంది రియ‌ల్ మ్యారేజ్ కోసం కాదు. రీల్ మ్యారేజ్‌ కోసం చెప్పి షాకిచ్చాడు. హైద‌రాబాద్‌లో ఆర్య‌, స‌యేషాల పెళ్లి వేడుక జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని టాక్.