కౌషల్‌ ఆర్మీకి అది తెలిస్తే కౌషల్‌నే చంపేస్తారు

Actress Tejaswi controversy comments on Kaushal Army

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో ఉన్న కొందరు ఇంటి సభ్యులకు సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మొదలైంది. ముఖ్యంగా కౌషల్‌కు అంతకు ముందు వరకు పెద్దగా గుర్తింపు లేదు. కాని బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మొదలైంది. కౌషల్‌ ఆర్మీ అంటూ ఒక పెద్ద సోషల్‌ మీడియా గ్రూప్‌ రన్‌ అవుతుంది. ఆ గ్రూప్‌లో ప్రతి రోజు వేలాది మంది కౌషల్‌కు మద్దతుగా పోస్ట్‌లు చేస్తూ ఉన్నారు. ఇక కౌషల్‌పై కొన్ని రోజుల క్రితం తేజస్వి తీవ్ర స్థాయిలో విరుచుకు పడటం, అంతకు ముందు భాను శ్రీ తిట్లదండకం అందుకోవడం వంటివి చేశారు. దాంతో భానుశ్రీ మరియు తేజస్విలపై కౌషల్‌ ఆర్మీ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతక పోస్ట్‌లు చేయడం జరిగింది.

తేజస్వి తాజాగా బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌ ఆర్మీపై స్పందించింది. తాను కౌషల్‌ను అన్న మాటలు చూపించారు. కాని ఆ తర్వాత తాను కౌషల్‌కు ఎన్నో సార్లు చెప్పిన సారీలు మాత్రం చూపించలేదు. రోజులో 24 గంటలు ఉంటుంది. ఆ 24 గంటల పాటు జరిగేది కేవలం గంట మాత్రమే ప్రతి రోజు చూపిస్తున్నారు. అందులో నా గురించి తప్పుగా చూపించారు. అయితే కౌషల్‌ ఆర్మీ అంటూ చెప్పుకునే వారు ఎవరైనా ఇంట్లో 24 గంటలు ఉంటే కౌషల్‌ నిజ స్వరూపం తెలుస్తుంది. ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆయన్ను అక్కడే చంపేస్తారు అంటూ తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. కౌషల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా తేజస్వి ఎటాక్‌ చేయడంతో కౌషల్‌ ఆర్మీ మరింతగా రెచ్చి పోతుంది.