టెన్త్ కుర్రాడితో టీచరమ్మ లవ్వాయణం…జంప్ !

ప్రేమలు హద్దులు దాటుతున్నాయి. అది ప్రేమా, కామమా అని ఆలోచించకుండా చేస్తున్న పనులు మనం ముందుకు వేలుతున్నామా లేక నాగరికత పేరుతో అనాగరికత వైపుకు వేలుతున్నామా అనే భయం వేస్తోంది. గురువును అరాధించడంతోపాటు తల్లిదండ్రులు, దైవం తరవాత స్తానం గురువులకే కల్పిస్తుంది మన భారతీయ సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి రెక్కలు విప్పిన దేశాల్లో విద్యార్ధులకి విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు వారిని లైగికంగా వాడుకోవడం ప్రేమ పేరుతో చేడకోట్టడం లాంటివి విన్నపుడు మన గురువులు మాత్రం ఇలాంటి పాడుపనులకు మినహాయింపు అనుకున్నాం.
అయితే హర్యానాలోని ఓ టీచరు మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా వ్వవహరించారు. ఏకంగా పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకున్న టీచరులానే విద్యార్థికి ప్రేమపాఠాలను నేర్పించారు. తన వద్ద చదువుకుంటున్న విద్యార్థితో ప్రమాయణం నడిపారు. అంతేకాదు తనకి మరో పెళ్లి వద్దనుకుందో ఏమో కానీ ఏకంగా 15 ఏళ్ల శిష్యుడితో కలిసి పరారైంది. ఈ సంఘటన హర్యానాలోని ఫతేబాద్‌లో వెలుగు చూసింది.

పదో తరగతి పిల్లాడిని తీసుకొని 29 ఏళ్ల స్కూల్ టీచర్ జంపైపోయింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగి చివరికి విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ పంతులమ్మను అరెస్ట్ చేశారు. జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పట్టణానికి చెందిన 15ఏళ్ల బాలుడు స్థానికంగా ఉన్న స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. అక్కడే పనిచేస్తున్న టీచర్‌.. ఆ పిల్లవాడిపై మనసు పారేసుకుంది. అతడికి మాయ మాటలు చెప్పి మెల్లిగా ట్రాప్‌లో పడేసింది. రోజూ ఫోన్‌లో మాట్లాడకుంటూ.. సోషల్ మీడియా ద్వారా కూడా టచ్‌లో ఉన్నారు. గత శుక్రవారం టీచరమ్మ పిల్లవాడికి ఫోన్ చేసింది. ఇంట్లో నుంచి జంపైపోదామని చెప్పింది. అతడు కూడా సై అనడంతో ఇద్దరూ వెళ్లిపోయారు. రాత్రైనా బాలుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి కంగారుపడ్డాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు స్కూల్లో ఆరా తీశారు. అప్పుడు కాని అసలు వ్యవహారం బయటపడలేదు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఈ జంట ఎక్కడుందో గుర్తించారు. సోమవారం నాడు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఈ జంట ముందుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ఖత్రా వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ అదుపులోకి తీసుకొని ఫతేబాద్ తీసుకొచ్చారు. వీళ్లద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట. ఈలోపే పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఇప్పుడు ఎక్కడా మనుషులకి రక్షణ దొరకడం లేదనేది స్పష్టం అవుతోంది. అభివృద్దిలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడాల్సింది పోయి క్రైంలో పోటీ పడాల్సి వస్తోంది.