త్రిష వీరాభిమాని మృతి

త్రిష వీరాభిమాని మృతి

సినీ ప్రపంచంలో తారలకు అభిమానులకు విడదీయలేని బంధం ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే కొందరు నటులు తమ కెరీర్‌లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకుంటారు. తమ హీరో, హీరోయిన్‌ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఈ క్రమంలో తారలు కూడా అంతే తమ ఫ్యాన్స్‌ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అంతెందుకు ఒక్కోసారి తమ అభిమానులను బాధపడే నిర్ణయాలు కూడా తీసుకోరు.

ఒకప్పుడు సినీ తారలను ఫ్యాన్స్‌ కలవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు పడేవాళ్లు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో స్టార్స్‌, ఫ్యాన్స్‌ మధ్య దూరం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నేరుగా మాట్లాడుకోవడం, చాట్‌ చేయడం సులువుగానే జరుగుతున్నాయి. తాజాగా త్రిష తమ అభిమాని గురించి చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట. అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది. తన గుండె బద్దలైందన్నట్టుగా చెప్పేసింది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన త్రిష తమిళంలో 96 సినిమాతో మంచి హిట్‌నే అందుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు.