అక్రమ సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఆమె మరో యువకుడితో అఫైర్ పెట్టుకుని ఆమె ప్రియుడి చేతిలోనే దారుణహత్యకు గురైంది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
తూత్తుకుడి జిల్లా తిరువైకుంఠం ప్రాంతంలోని ముదలైమొళి ఉత్తర వీధికి చెందిన మల్కియా (35) అనే మహిళకు 17ఏళ్ల క్రితం ముత్తస్వామి అనే వ్యక్తితో 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఇంటికి వచ్చే భర్త స్నేహితుడైన లారీ డ్రైవర్ మాణిక్యరాజ్తో మల్కియా అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలిసిన ముత్తుస్వామి భార్యను హెచ్చరించాడు. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పిన మల్కియా అతడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. 2014, మే 13న భర్తను ప్రియుడితో కలిసి మల్కియా చంపేసింది. ఈ కేసులో పోలీసులు మల్కియా, మాణిక్యరాజ్ను అరెస్ట్ చేశారు.
2015లో వీరిద్దరూ బెయిల్పై బయటకు వచ్చి సహజీవనం చేస్తున్నారు. ఇదే క్రమంలో మల్కియా ఓ కంపెనీ ఉద్యోగానికి చేరింది. అక్కడ పనిచేసే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని మాణిక్యరాజ్ను పట్టించుకోవడం మానేసింది. దీంతో అతడు మల్కియాతో తరుచూ గొడవలు పెట్టుకునేవాడు.
తనను మోసం చేసిన మల్కియాను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం రాత్రి కంపెనీ నుంచి ఇంటికి వెళ్తున్న మల్కియాను అడ్డగించి కత్తితో పలుసార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మల్కియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.