బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు

బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు

ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడులలో 19 మంది అమాయకులు మృతి చెందారు. వీరిలో 9 మంది భద్రత దళాలున్నట్లు సమాచారం. సెంటర్‌ నార్త్‌ రీజియన్‌లో జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిని ముష్కరులు కాలబెట్టారు.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణల కారణంగా బుర్కినాఫాసోలో హింస రోజురోజుకి పెరుగుతుంది. దీంతో వేలాది మంది అమాయకులు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.