టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఇప్పుడు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో భారీ మూవీ “గేమ్ చేంజర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై భారీ హైప్ నెలకొనగా ఈ మూవీ తర్వాత చరణ్ మరో రెండు మూవీ లు ఓకే చేసాడు. అయితే ఆఫ్ లైన్ లో కూడా రామ్ చరణ్ కు మంచి ఆదరణ ఉంది. అంతా చరణ్ ఎంతో సౌమ్యుడు అని కూడా కొనియాడుతూ ఉంటారు.
అలా ఆఫ్ లైన్ లో తన స్వభావంతో ఎంతో మందికి దగ్గరైన తాను ఇప్పుడు ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నై వేల్స్ యూనివర్సిటీ వారు అయితే రామ్ చరణ్ కు ఇప్పుడు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి అరుదైన గౌరవాన్ని అందించారు. మరి కళారంగంలో రామ్ చరణ్ అందించిన సేవలకు గాను వారు ఈ అందిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి గత కొన్నాళ్ల కితమే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కూడా వేల్స్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ను అందించిన సంగతి తెలిసిందే. కానీ దానిని పవన్ సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ కు ఈ గౌరవం రావడం విశేషం. అయితే ఈ కార్యక్రమం ఈ ఏప్రిల్ 13న జరగనుంది అని టాక్ వస్తుంది . దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.