వచ్చే నెల కూడా కెవ్వు కేకే…!

After September, Big Films Are Coming In Dasara Gift

గత రెండు నెలల్లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందుకు పలు పెద్ద, చిన్నా చిత్రాలు వచ్చాయి. కాని ఆర్‌ఎక్స్‌ 100 మినహా ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేక పోయింది. జూన్‌, జులైలో విడుదలైన చిత్రాల విషయంలో పూర్తి నిరాశను వ్యక్తం చేసిన ప్రేక్షకులు ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రేపు విశ్వరూపం 2 విడుదలకు సిద్దంగా ఉంది. ఇక గీతా గోవిందం మరియు శైలజ రెడ్డి అల్లుడు కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టులో క్రేజీ ప్రాజెక్టులు ఉన్న కారణంగా సినిమా ప్రేమికులు పండగ చేసుకోవచ్చు. ఇక వచ్చే నెలలో కూడా పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

paper-boy

ఆగస్టు శైలజ రెడ్డి అల్లుడు చిత్రంతో పూర్తి అవుతుండగా, సెప్టెంబర్‌ రెండు చిత్రాలతో ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్‌ 7వ తారీకున పేపర్‌ బాయ్‌ మరియు సిల్లీ ఫెలోస్‌ చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో సిల్లీ ఫెలోస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా అల్లరి నరేష్‌, సునీల్‌లు కలిసి అలరించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఆ తర్వాత సమంత ఏరి కోరి చేసిన యూటర్న్‌ చిత్రం విడుదల కాబోతుంది. సమంత మూవీ విడుదలైన వారం రోజుల్లోనే నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రం విడుదల కాబోతుంది. ఇలా సెప్టెంబర్‌ మొత్తం కూడా పలు పెద్ద, చిన్న క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో సత్తా చుపుతాయో చూడాలి. సెప్టెంబర్‌ తర్వాత అక్టోబర్‌లో దసరా కానుకగా పెద్ద సినిమాలు వస్తున్న విషయం తెల్సిందే.

selli-fellows