ఈవారం కూడా అన్ని తుస్సే..!

Again Failure Talk For Four New Movies In Tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్ని వారాలుగా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి నుండి కూడా ఒకటి రెండు తప్ప పెద్దగా ఆకట్టుకున్న చిత్రాలే లేవు. మూడు నెలుగా తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద సక్సెస్‌ లేకపోవడంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో నాలుగు చిత్రాలు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నాలుగు సినిమాల్లో ఎమ్మెల్యే మరియు నీదీ నాదీ ఒకే కథ చిత్రాలు ప్రేక్షకుల మరియు సినీ వర్గాల దృష్టిని ఆకర్షించాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. 

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాలుగు చిత్రాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఎమ్మెల్యే సినిమాపై చాలా అంచనాు పెట్టుకోగా ఆ చిత్రం మూస కథ కథనాలతో పాత సినిమాలను చూసిన అనుభూతినే మిగిల్చింది. కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ల జంట విడుదల ముందు వరకు తెగ హల్‌చల్‌ చేశారు. కళ్యాణ్‌ రామ్‌ న్యూ లుక్‌ మరియు కాజల్‌ గ్లామర్‌ ఈ సినిమాకు తప్పకుండా హైలైట్‌ అవుతుందని భావించారు. కాని మెయిన్‌ కథ మరియు కథనాలు మాత్రం ఆకట్టుకోలేక పోవడంతో సినిమా ఫలితం తారు మారు అయ్యింది. నాలుగు సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. వచ్చే వారం ‘రంగస్థలం’ చిత్రం ఎలాంటి ఫలితంను సాధిస్తుందో చూడాలి.