‘ఎన్టీఆర్‌’కు పోటీగా ‘యాత్ర’?

YSR Biopic Movie Yatra Giving Competition To NTR Biopic Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తేజ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించబోతున్న ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈనెలలోనే పూజా కార్యక్రమాలు జరుపనున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు మొదలు అయ్యాయి. ఈ సమయంలోనే రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రతో ‘యాత్ర’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యారు.

‘యాత్ర’ అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ప్రభావంను చూపుతాయనే ఉద్దేశ్యంతో రాజకీయ వర్గాల వారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా వల్ల తెలుగు దేశం పార్టీపై సానుభూతి కలిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో ‘యాత్ర’కు శ్రీకారం చుట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి గురించి కంటే జగన్‌ గురించి ఎక్కువ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మమ్ముటీ కనిపించనుండగా, జగన్‌ పాత్రలో ఒక యువ హీరోను చూపించబోతున్నారు. మొత్తానికి ఈ రెండు చిత్రాలు కూడా ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు కూడా ఆయా పార్టీలకు ఎంత మేరకు ప్లస్‌ అవుతాయి అనేది చూడాలి.