అరుణాచలానికి అజ్ఞాతవాసి రివర్స్…

Agnathavasi story Same Like as Rajinikanth Arunachalam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ బయటకు రాగానే ఆ సినిమా కథ గురించి ఎన్నో ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ , కాప్షన్ కూడా సరిపోవడంతో ఇది 2011 లో హాలీవుడ్ లో వచ్చిన “ది హెయిర్ అప్పా రెంట్ “ కథతో తీస్తున్నారని టాక్ వచ్చింది. ఓ కోటీశ్వరుడుకు ఇద్దరు భార్యలు. అతను కొందరి కుట్రకి బలైపోతాడు. అతని ఆస్తి కాజేయాలని చూసే వాళ్లకు ఆ కోటీశ్వరుడు మొదటి భార్యకు ఓ కొడుకు పుట్టాడని అతని సంతకం లేనిదే ఆ ఆస్తి తమ వశం కాదని తెలుస్తుంది. అతన్ని వెదుక్కుంటూ వెళ్లే విలన్ బృందాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నదే మిగిలిన కథ.

Rajinikanth Arunachalam movie

ఈ కథ నే రెండో వైపు నుంచి చెబితే అప్పుడెప్పుడో సూపర్ స్టార్ రజనీకాంత్ తీసిన అరుణాచలం సినిమా. అందులో భార్యాబిడ్డలను వదిలి విదేశాలు వెళ్లిన ఓ యువకుడు భారీగా సంపాదిస్తాడు. అయితే అతను తిరిగి వచ్చేసరికి భార్యాబిడ్డల ఆచూకీ దొరకదు. అయితే అతను తన వారసుడు ఎప్పటికైనా వస్తాడన్న నమ్మకంతో ఆస్తిని మొత్తం ఓ ట్రస్ట్ కింద ఉంచుతాడు. తన కొడుకు ఏనాటికైనా వచ్చి తాను పెట్టిన పరీక్షలో నెగ్గితే ఆ ఆస్తి అతనికి లేదా ట్రస్ట్ కి చెందేలా విల్లు రాస్తాడు. కానీ ఆ ట్రస్ట్ సభ్యులు కొందరు ఆ ఆస్తి కాజేయడానికి చూస్తున్న సమయంలో అరుణాచలం అనుకోకుండా అక్కడికి వస్తాడు. వారి కుట్రలు ఛేదించి ఆ ఆస్తి అక్రమార్కుల పాలు గాకుండా చూస్తాడు .

ఇప్పుడు “ది హెయిర్ అప్పా రెంట్ “ స్పూర్తితో అజ్ఞాతవాసి వస్తుంది నిజమే అయితే అరుణాచలం కథ కూడా దీనికి ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఏదేమైనా అజ్ఞాతవాసి బయటకు వచ్చే దాకా ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.