వెంకీ ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి రిలీజ్‌

Venkatesh Scenes adding in Agnathavasi movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ 25వ చిత్రం అజ్ఞాతవాసి చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకు ఈ చిత్రానికి కనీసం సంబంధం కూడా లేకుండా ఉందని, ఇది త్రివిక్రమ్‌ మార్క్‌ సినిమాలా లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సినిమా పనైపోయిందని తేలిపోయింది. ఈ సమయంలోనే రెండవ వారంలో యాడ్‌ చేయాలనుకున్న వెంకటేష్‌ సీన్స్‌ను సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటి వరకు అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్‌ ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక ప్రకటన రాలేదు. మొదటి నుండి కూడా లీక్‌లు ఇచ్చుకుంటూ వచ్చిన టీం ఇప్పుడు వెంకటేష్‌ డబ్బింగ్‌ చెబుతున్న విజువల్స్‌ను విడుదల చేయడం జరిగింది. వెంకీ, పవన్‌లు కలిసి కూర్చుని డబ్బింగ్‌ చెబుతున్న టీజర్‌ విడుదలైన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆ సీన్‌ ఎలా ఉంటుందా అని అంతా ఊహించుకుంటున్నారు. ఫ్యాన్స్‌ మరోసారి సినిమా చూడాలనే ఆలోచనలో ఉన్నారు. సంక్రాంతి రోజు నుండి అజ్ఞాతవాసి చిత్రంలో వెంకటేష్‌ సీన్స్‌ ఉంటాయని తేలిపోయింది. వెంకటేష్‌ ఒక సీన్‌లో ఉంటాడని, పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకీ కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఇప్పటికే లీక్‌ అయ్యింది. ఇప్పటికే భారీగా నష్టపోయిన ఈ చిత్రానికి వెంకీ సీన్స్‌ ఏమైనా ఊపును తెస్తాయేమో చూడాలి.