కూచిభొట్ల భార్య‌కు ట్రంప్ వ‌ర్గం నుంచి ఆహ్వానం

trump invites kuchibhotla Srinivas wife over state of the union address

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికాలోని కాన్సాస్ లో గ‌త ఏడాది జ‌రిగిన జాతివివ‌క్ష దాడిలో ప్రాణాలు కోల్పోయిన భార‌తీయ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సున‌య‌న‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఈ నెల 30న అమెరికాలో జ‌రిగే స్టేట్ ఆఫ్ యూనియ‌న్ అడ్రెస్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని ఆమెకు ఆహ్వానం అందింది. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌ర్గానికి చెందిన ప్ర‌తినిధి కెవిన్ యోడ‌ర్ సున‌య‌నను ఈ కార్యక్ర‌మానికి ఆహ్వానించారు. దీనిపై కెవిన్ మాట్లాడుతూ భార‌తీయుల‌తో పాటు ఇత‌ర దేశాలకు చెందిన వ‌ల‌స‌దారుల‌ను ఆహ్వానించేందుకు అమెరికా సిద్దంగా ఉందని తెలియ‌జేయ‌డానికే ఈ ఇమ్మిగ్రేష‌న్ విష‌యం గురించి ఇంత‌గా ఆలోచిస్తున్నాన‌ని అన్నారు. శ్రీనివాస్ మ‌ర‌ణంతో సున‌య‌న అమెరికాలో త‌న పౌర‌స‌త్వం కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ అమెరికాలో ఉండ‌డానికి అక్క‌డి అధికారులు ఆమెకు అనుమ‌తి ఇచ్చారు. శ్రీనివాస్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సున‌య‌న త్వ‌ర‌లో భార‌త్ రాబోతున్నారు. అమెరికాలోని త‌న స్నేహితులు, కుటుంబీకుల నుంచి తన‌కు పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సున‌య‌న తెలిపారు.