ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ సాన.

Trivikram srinivas focus on NTR movie script

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అజ్ఞాతవాసితో త్రివిక్రమ్ కెరీర్ ప్రమాదంలో పడలేదు గానీ ఆయన ప్రతిష్టకు మాత్రం పెద్ద సవాల్ ఎదురైంది. ఈ ఛాలెంజ్ నెగ్గి తనలో పస తగ్గలేదని నిరూపించడానికి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా త్రివిక్రమ్ కి పెద్ద అవకాశం. ఈ ఛాన్స్ ని తేలిగ్గా తీసుకోకూడని త్రివిక్రమ్ ఫిక్స్ అయిపోయాడు. సంక్రాంతి వేడుకల సమయంలో కూడా ఎక్కువ సమయం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కోసమే త్రివిక్రమ్ సమయం వెచ్చించాడట. స్క్రిప్ట్ లో ఎక్కడా ఒక్క లూస్ ఎండ్ కూడా లేకుండా చూస్తున్నాడట. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో ఇంతకుముందు ఓకే అనుకున్న దాని కన్నా ఇంకాస్త మెరుగైన అవుట్ ఫుట్ ఇవ్వడానికి ఏమి చేయాలో అంతా చేస్తున్నాడట. తొలి సినిమా చేస్తున్నప్పుడు ఓ దర్శకుడు ఎంత కష్టపడతాడో అంతగా శ్రమిస్తున్నాదంట త్రివిక్రమ్.

త్రివిక్రమ్ విషయంలో మిగిలిన వాళ్ళు ఏమి అనుకున్నా అజ్ఞాతవాసికి భారీగా డబ్బు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాకి నిర్మాత గా ఉన్న చినబాబు మాత్రం నమ్మకంగానే ఉన్నారంట. ఇక ఎన్టీఆర్ అయితే అజ్ఞాతవాసి ఫలితాన్ని ఏ మాత్రం పట్టించుకోవద్దని స్వయంగా త్రివిక్రమ్ కి ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గురించి మాత్రమే త్రివిక్రమ్ ప్రస్తుతం ఆలోచిస్తున్నాడట. ఎన్టీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లో భారీ హిట్ ఇవ్వాలని తపిస్తున్న త్రివిక్రమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.