ఆ హీరోయిన్ 10 కోట్లతో ఇల్లు కొని 20 కోట్లతో …

Kangana Ranaut Buys 8-bedroom bungalow in Manali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కంగనా రౌనత్… ఇప్పుడు బాలీవుడ్ లో వివాదాల ముందు ఆమె పేరు వినిపిస్తోంది. అయినా ఆమె డిమాండ్ కొంచెం కూడా తగ్గలేదు సరికదా ఇంకాస్త పెరిగింది. ఆమె కోసం దర్శకులు సరికొత్త పాత్రలు సృష్టిస్తుంటే, నిర్మాతలు కంగనా కాల్షీట్స్ కోసం ఎగబడుతున్నారు. ఆమె కూడా ఈ సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్ మాట ఎలా వున్నా సినీ జనాల ప్రవర్తన మీద మాత్రం ఆమె అంత సానుకూలంగా లేరట. హృతిక్ రోషన్ తో గొడవ తర్వాత ఆమెలో ముంబై జనాల మీద సందేహాలు ఇంకాస్త పెరిగిపోయాయట. ఈ పరిస్థితుల్లో ఆమె ఎప్పటికైనా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కి వెళ్లి సెటిల్ అయ్యే ఆలోచన చేస్తోందట. ఇటీవల క్వీన్ సినిమా పారితోషికం 10 కోట్లు వెచ్చించి మనాలి లో ఓ భారీ భవంతి ని కంగనా ఖరీదు చేసిందట.

ఆ బిల్డింగ్ ఇంటీరియర్ కోసం ఆమె ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసిందట. ప్రముఖ ఆర్కిటెక్చెర్ షబ్నమ్ గుప్తా కి ఈ పని అప్పజెప్పిన కంగనా ఈ 8 పడక గదుల ఇంటిలో సర్వ సౌఖ్యాలు ఉండేలా ప్లాన్ చేసిందట. ఇక ఈ ఇంటి స్పెషల్ ఏమిటంటే ఇందులోని ఏ గది నుంచి చూసినా సమీపంలోని మంచుకొండలు దర్శనం ఇస్తాయట. కెరీర్ పీక్ లో ఉండగానే కంగనా ఇలా రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ఆలోచించడం, ప్లాన్ చేసుకోవడం చూస్తుంటే మాత్రం ముంబై అనుభవాలు ఆమెని ఎంతగా ఇబ్బంది పెట్టాయో, రాటు దేల్చాయో అర్ధం అవుతుంది.