‘అజ్ఞాతవాసి’ హాట్‌ అప్‌డేట్‌

Agnathavasi trailer release on December 26

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ కోసం మెగా ఫ్యాన్స్‌ మరియు తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఆడియో విడుదలైన నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని ఆడియో వేడుకలో త్రివిక్రమ్‌ మాటల ద్వారా అర్థం అయ్యింది. ఆడియో విడుదల సందర్బంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. కాని ఆడియో విడుదల రోజు ప్రేక్షకులకు నిరాశ కల్గించిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్‌ను ఖరారు చేయడం జరిగింది. ట్రైలర్‌ రిలీజ్‌కు తాజాగా డేట్‌ను ఖరారు చేశారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్‌ను క్రిస్మస్‌ తర్వాత రోజు అంటే డిసెంబర్‌ 26న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ముందుగా కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే సినిమా విడుదలకు మరీ దగ్గర్లో ట్రైలర్‌ విడుదల చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఇలా చేశారు. ట్రైలర్‌ విడుదల తర్వాత ఆ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి చిత్ర ప్రమోషన్స్‌ చేయాల్సి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ట్రైలర్‌ ఈనెల 26న అనే విషయంపై క్లారిటీ అనధికారికంగా వచ్చింది. అధికారికంగా కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.