శరత్‌ మరార్‌ ఒప్పుకోలేదు.. రాధాకృష్ణ ఒప్పుకున్నాడు

Agnyaathavaasi Producer Returns 20 crores to Distributors,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’ వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఈ మూడు సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున నష్టపోయారు. మూడు సినిమాల డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ భావించాడు. కాని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడు నిర్మాత అయిన శరత్‌ మరార్‌ అందుకు ఒప్పుకోలేదు. అజ్ఞాతవాసి చిత్ర నిర్మాత రాధాకృష్ణ మాత్రం పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లుగా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చి, కోట్లలో డబ్బును తిరిగి ఇవ్వడం జరిగింది. అజ్ఞాతవాసి చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 20 కోట్ల మేరకు తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పవన్‌ మాటపై రాధాకృష్ణ గౌరవంతో నష్టాలను భరించాడు. కాని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ నష్టాలను భరించేందుకు నిర్మాత శరత్‌ మరార్‌ ఒప్పుకోలేదు. కాటమరాయుడు డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ఇచ్చి వారిని ఆదుకుందాం అంటూ పవన్‌ను ఒప్పించాడు. కాటమరాయుడు సక్సెస్‌ అయితే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవుతారు కదా అని పవన్‌ అందుకు సరే అన్నాడు. కాని పవన్‌ పరువు తీసేలా శరత్‌ మరార్‌ కాటమరాయుడు రైట్స్‌ను ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యి మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు కోట్లలో నష్టపోయారు. వారికి సాయం చేయాల్సిందిగా శరత్‌ మరార్‌ను పవన్‌ కోరాడు. తన పారితోషికంలోంచి కూడా కొంత మొత్తం ఇస్తాను అంటూ చెప్పినా కూడా అందుకు శరత్‌ మరార్‌ ఒప్పుకోలేదు. ఆ కారణంగానే శరత్‌ మరార్‌ను దూరం పెట్టినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.