ఎయిమ్స్‌ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

ఎయిమ్స్‌ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సెప్టెంబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. నర్సింగ్ ఆఫీసర్ రాతపరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి తమ ఐడీ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది.

షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న దేశంలోని వివిధ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్ రాతపరీక్షను ఎయిమ్స్ నిర్వహించింది. సెప్టెంబరు 24న ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల ఆధారంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు ఇతర నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని నర్సింగ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో వీఎంఎంసీ & సప్దార్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింజే మెడికల్ కాలేజ్ & శ్రీమతి సుచేతా కృపలానీ హాస్పిటల్, కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లోని పోస్టులను భర్తీ చేస్తారు.