Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంగళగిరి, అక్టోబర్ 25:
- మంగళగి ఎయిమ్స్ నిర్మాణంపై సంబంధిత ఆధికారులతో మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ కోన శశిధర్ సమీక్ష.
- సమావేశంలో పాల్గొన్న ఎన్డీఆర్ ఎఫ్, ఆర్ అండ్ బీ, అటవీ శాఖ, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ కో, పబ్లిక్ హెల్త్, హెచ్ ఎస్ సీసీ, ఎయిమ్స్ కాంట్రాక్టర్ కె.ఎమ్.వి ప్రతినిధులు తదితరులు.
- మంగళగిరిలో ఎయిమ్స్ పనులు బాగా జరుగుతున్నాయి.
- ఎయిమ్స్ నిర్మాణం మొదటి దశలో భాగంగా ఓపి బ్లాక్, రెసిడెండియల్ క్వార్టర్స్ నిర్మాణపనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఎయిమ్స్ మొదటి దశ నిర్మాణపనులు డిశంబర్ 2018 నాటికి పనులు పూర్తి చేస్తామని కె.ఎమ్.వి ప్రాజెక్ట్స్ వారు తెలిపారు.- ఎయిమ్స్ రెండవదశ పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం.
- రెండవదశలో ఆసుపత్రి, మెడికల్ కాలేజి భవనాలను నిర్మిస్తాం.
- మూడవదశలో ఎక్యూప్ మెంట్ ఏర్పాటు చేస్తాం.
- ముఖ్యమంత్రి గారు ఎయిమ్స్ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
- చిన చిన్న సమస్యలను కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.
- R&B వారు 0.5 కిలొమీటర్లు 100 మీటర్లు రోడ్డు వేస్తున్నారు…త్వరలో 1.1కి.మీ కూడ రోడ్డు వేస్తారు.
- అటవీ శాఖ వారు కూడ ఏమీ ఇబ్బందులు లేవన్నారు…త్వరలో మూడు చోట్ల స్ధలం కేటయిస్తామన్నారు.
- ఎన్డీఆర్ ఎఫ్ వారు మరో ఆరు నెలలులో స్ధలం ఖాళీ చేస్తామన్నారు.
- ట్రాన్స్ కో వారు సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
- సీఎం గారు వచ్చిన తరువాత ప్రకాశం బ్యారేజ్ నుంచి రా వాటర్ పంపింగ్ కోసం ప్రత్యేకంగా 12.3 కిలోమీటర్లు రూ.14 కోట్లతో ప్రత్యేకంగా లైన్ నిర్మించాల్సి ఉంది.
- రాష్ట్ర ప్రభుత్వం రావాటర్, విధ్యుత్, స్ధలం ఇవ్వాలని అగ్రిమెంట్ లో ఉందిః మంత్రి కామినేని శ్రీనివాస్.