పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన స్పైస్‌జెట్ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి స్పైస్‌జెట్ విమానం చేరుకుంది.
అయితే పొగమంచు దట్టంగా కమ్మేయడాన్ని గమనించిన పైలట్ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే కాసేపు తిప్పారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత పొగమంచు తొలగడంతో సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేశారు.