ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జియో నుంచి పోటీని తట్టుకోలేక పోతున్న ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా అందిస్తున్న 3జీ సేవలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. భారతీ ఎయిర్‌టెల్ సీ.ఈ.ఓ గోపాల్ విట్టల్ 3జీ సేవలను నిలిపివేయాలన్న విషయాన్ని ధ్రువీకరించారు.
భారతీ ఎయిర్‌టెల్ 2జీ సేవల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోనునదో అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందిస్తు రెవెన్యూ వస్తున్నంత కాలం 2జీ నెట్‌వర్క్ నుంచి సేవలు కొనసాగిస్తూ ఉంటాము అని తెలిపారు. 2జీ సేవలలో ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తూనే ఉంటామని వెల్లడించారు.
హరియాణాలో 3జీని భారతీ ఎయిర్‌టెల్ కలకత్తాలో నిలిపి వేసింది. కలకత్తాలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ 3జీ షట్‌డౌన్ అయింది. 2జీ, 4జీ సేవలను యథాతథంగా ఈ రెండు రాష్ట్రాలలో కూడా కొనసాగిస్తూ ఉంటాము అని తెలిపారు. దేశ వ్యాప్తంగా 2020 మార్చి నాటికి 22 టెలికాం సర్కిల్‌ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను నిలిపి వేయనున్నట్లు తెలియ చేశారు.