ఆర్‌ఎక్స్‌100 దర్శకుడితో మెగా హీరో?

ajay bhupathi movie with mega hero

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని దక్కించుకున్న ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతిపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ ఎత్తున ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు వరుసగా హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడికి పలువురు హీరోలు ఫోన్‌ చేసి అభినందించినట్లుగా తెలుస్తోంది. వర్మ శిష్యుడు అయిన అజయ్‌ తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించాడు. వర్మ శిష్యుడి మూవీ అన్నట్లుగా ఎక్కడ కూడా అనిపించలేదు. సొంత ట్యాలెంట్‌తో ఈ చిత్రాన్ని అజయ్‌ తెరకెక్కించాడు అని తేలిపోయింది.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తర్వాత అజయ్‌ భూపతికి మెగా కంపౌండ్‌ నుండి కాల్‌ వచ్చిందని, మెగా హీరో కోసం ఒక కథను సిద్దం చేయాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమెగా హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మెగా హీరోతో పాటు పలువురు యువ హీరోలు కూడా అజయ్‌ దర్శకత్వంలో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా వారి వారి మేనేజర్‌లు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి తన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న దర్శకుడు అజయ్‌ వచ్చే నెలలో తన తదుపరి చిత్రానికి సంబంధించిన వర్క్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఏ దర్శకుడు అయిన మెగా హీరోతో సినిమా చేయాలని భావిస్తాడు. అందుకే అజయ్‌ భూపతి కూడా తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతోనే చేస్తాడేమో చూడాలి. మంచి కథతో వెళ్తేనే మెగా హీరోను డైరెక్ట్‌ చేసే అవకాశం ఈయనకు దక్కుతుంది. మరి మంచి కథను అజయ్‌ సిద్దం చేసుకోగలడా అనేది చూడాలి.