ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం మోహన్ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలన్నారు.
ఇండస్ట్రీలో సమస్యల గురించి సీఎంలకు వివరించాలంటే అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి కానీ, నలుగురినే రమ్మన్నారనడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమేనని.. అందరం కలిసికట్టుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో దివంగత డైరెక్టర్ దాసరి నారాయణ లోటు తీరుస్తూ ఆయన స్థానంలో ఉండి పరిశ్రమను ముందుండి నడిపించే పెద్ద దిక్కు ఎవరా? అనే దానిపై ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి చేసిన ఓ ట్వీట్ హాట్‌టాపిక్ మారింది. తన బాస్ ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలన్నది తన ఆశ అని పేర్కొన్నాడు. ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ అజయ్ భూపతి రాసుకొచ్చిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల వివాదంపై చర్చ నడుస్తున్న క్రమంలో ఆర్జీవీ వరస ట్వీట్లు చేస్తూ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే.